యు. కొత్తపల్లి మండలం ఎస్ఐగా జి. వెంక టేష్ శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. కొంతకాలంగా పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో అదనపు ఎస్ఐగా పనిచేసిన ఆయనను ప్రభుత్వం ఇక్కడ ఎస్ఐగా నియమించింది. శాంతిభద్రతల పరిరక్షణ, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన తెలిపారు. నాటుసారా నిర్మూలనకు కృషి చేస్తానని ఆయన మీడియాకు తెలియజేసారు.