
గొల్లప్రోలు: రేషన్ బియ్యం పట్టివేత
గొల్లప్రోలు గాంధీ నగరం వీధిలో మొగలి దుర్గానందరావు ఇంటిలో 17. 49 క్వింటాళ్ల రేషన్ బియ్యం పోలీసు, పౌరసరఫరాలు, రెవోన్యూ అధికారులు సోమవారం గుర్తించారు. రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు వచ్చిన సమాచారంపై పిఠాపురం సీఐ శ్రీనివాస్ తో కలిసి దాడి చేసినట్లు గొల్లప్రోలు ఎస్సై రామకృష్ణ తెలిపారు. 35 సంచుల్లో బియ్యం ఉన్నాయని, తూనిక వేయగా 17. 49 క్వింటాళ్లుగా ఉన్నట్లు చెప్పారు.