రాష్ట్రంలో వివిధ పట్టణాల్లో, నగరాల్లో ఉన్న టిడ్కో గృహ సముదాయాల పరిస్థితి పై త్వరలోనే శ్వేత పత్రం విడుదల చేస్తామని ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం పిఠాపురం పట్టణంలో ఉన్న గోర్స రోడ్లో ఉన్న అపార్ట్మెంట్లను మున్సిపల్ కమిషనర్ కనకారావుతో కలిసి అజయ్ కుమార్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.