కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి 32 కేజీల లడ్డు ప్రసాదాన్ని అంబికా స్వీట్ హోమ్ అధినేత సామన వెంకటరమణ శుక్రవారం సమర్పించారు. ఈ సందర్భంగా సామన వెంకటరమణ మాట్లాడుతూ సుమారు 18 సంవత్సరముల నుండి అమ్మవారికి లడ్డు ప్రసాదాన్ని సమర్పిస్తున్నామని వెంకటరమణ అన్నారు. ఈ లడ్డును ఆలయ కమిటీ వారికి అందజేసి అనంతరం అమ్మవారి దర్శనం చేసుకున్నారు.