వినాయక చవితి కార్యక్రమాలకు సంబంధించి ఈ నెల 16న వినాయక నిమజ్జనం చేసే ప్రాంతాలను శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పరిశీలించారు. కాకినాడ రూరల్ మండలంలో పలు ప్రాంతాలు, కాకినాడ సూర్యారావుపేట బీచ్ లో గణేష్ నిమజ్జనం చేయనున్నందున అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను జేసీ రాహుల్ మీనా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక నిమజ్జన్నానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.