రాజమండ్రి: మతం పేరుతో రాజకీయాలు చెయ్యొద్దు: సీపీఐ

70చూసినవారు
రాజమండ్రి: మతం పేరుతో రాజకీయాలు చెయ్యొద్దు: సీపీఐ
దేశ ఐక్యతకు సమగ్రతకు అతిపెద్ద ప్రమాదాల్లో మతోన్మాదం ఒకటని దీనిని ప్రజలందరూ గమనించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రిలో జరిగిన సీపీఐ శాఖ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మతోన్మాదం అభివృద్ధి నిరోధికుల సృష్టి అని అది దేశ రాజకీయాల లౌకిక స్వభావాన్ని తునాతునకలు చేస్తుందన్నారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తే సీపీఐ చూస్తూ ఊరుకోదన్నారు.

సంబంధిత పోస్ట్