రాజమండ్రి: బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు
తూ. గో జిల్లాలో సారా బట్టీలు, గంజాయి, బెల్ట్ షాపులు నిర్వహిస్తే కేసులో నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్రమ మద్యం పై దాడులు నిర్వహించి 47 మంది పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో సారా తయారీకి ఉపయోగించే 5, 300 లీటర్ల బెల్లం ఊట, 6, 500 కిలోల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.