తూ. గో జిల్లాలో లైసెన్సు కలిగిన వారు మాత్రమే ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి బాణసంచా తయారీ, విక్రయాలు చేయాలని జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ సూచించారు. మంగళవారం రాజమండ్రిలోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు. అక్రమంగా బాణసంచా తయారీ, సరఫరా, విక్రయాలు చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.