రాజమండ్రి: నాణ్యతా ప్రమాణాలతో అభవృద్ధి పనులు చేపట్టాలి

62చూసినవారు
రాజమండ్రి: నాణ్యతా ప్రమాణాలతో అభవృద్ధి పనులు చేపట్టాలి
నాణ్యతా ప్రమాణాలతో అభివృద్ధి పనులు చేపట్టాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ నగర పాలక సంస్థ అధికారులకు సూచించారు. మంగళవారం రాజమండ్రిలోని 9వ డివిజన్లో రూ. 43 లక్షలతో చేపట్టిన డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నగరాభివృద్ధే ధ్యేయంగా తాము పని చేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే నగర అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నారు.

సంబంధిత పోస్ట్