రాజానగరం మండలం కానవరంలో ఈ నెల 3న జరిగిన చోరీ కేసులో నిందితుడు అదే గ్రామానికి చెందిన శ్రీమన్నారాయణను అరెస్ట్ చేశామని సీఐ వీరయ్యగౌడ్ మంగళవారం తెలిపారు. నిందితుడి నుంచి 14 కాసులు బంగారం, రూ. 20 వేలు నగదు రికవరీ చేశామన్నారు. బాధితుడికి పరిచయం ఉన్న శ్రీమన్నారాయణ ఇంట్లోని బీరువాలో నగదు, వస్తువులు పెట్టడం గమనించి చోరీకి పాల్పడ్డాడన్నారు.