ప్రజలు ఇచ్చిన వినతులను సకాలంలో పరిష్కరించి న్యాయం చేస్తానని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. బుధవారం కోరుకొండ మండలం జనసేన పార్టీ కార్యాలయానికి వివిధ సమస్యలతో విచ్చేసిన ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించారు. వెంటనే వాటిని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.