రాజానగరం: ఇసుక లేక నిర్మాణ రంగం కార్మికులు లబో దిబో-సీపీఐ

61చూసినవారు
రాజానగరం: ఇసుక లేక నిర్మాణ రంగం కార్మికులు లబో దిబో-సీపీఐ
గత మూడు నెలలుగా ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగం కార్మికులు లబో దిబో మంటూ అర్ధాకలితో అలమటిస్తూన్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విమర్శించారు. బుధవారం కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో జరిగిన సీపీఐ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉచిత ఇసుక పథకం అమలు కావడం లేదన్నారు. ఇసుక పై జీఎస్టీ విధించడం సరికాదన్నారు. దానిని వెంటనే రద్దు చేయాలని మధు డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్