వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి కోనసీమ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు శుక్రవారం రూ. లక్ష రూపాయల చెక్కును అందజేసారు. రామచంద్రపురంలో మంత్రి సుభాష్ ను వారి ఇంటి వద్ద కలిసి చెక్కును అందజేసారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు విరాళాల రూపంలో ప్రభుత్వానికి చేయూతనివ్వడం అభినందించదగ్గ విషయమని మంత్రి సుభాష్ అన్నారు.