దేహంలో ఉన్న లోపాన్ని ధైర్యంతో అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దివ్యాంగులకు సూచించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం విఎస్ఎం కళాశాలలో వికాస సార్థక సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం దివ్యాంగుల కోసం ప్రత్యేక జాబ్ మేళాను నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో 38 మందిని ఎంపిక చేసి 60 రోజుల పాటు ఆన్లైన్లో శిక్షణ ఇవ్వనున్నారు.