గ్రామాలలోని సమస్యలను దఫ దఫాలుగా పరిష్కారానికి కృషి చేయనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. మన గ్రామం మన సుభాష్ కార్యక్రమంలో భాగంగా శనివారం రామచంద్రపురం నియోజకవర్గంపరిధిలోని కె. గంగవరం మండలంలోని పాణింగపల్లి, సత్యవాడ, తామరపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజా వినతులనుఆయన స్వీకరించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తప్పకుండాకృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.