ఘనంగా మాజీ స్పీకర్ బాలయోగి జయంతి వేడుకలు

62చూసినవారు
రాజోలు మండలం రాజోలులోని కాటన్ పార్కు వద్ద దివంగత మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి జయంతి వేడుకలను కూటమి నాయకులు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎంపీపీ కేతా శ్రీనివాస్, నాయకులు కడలి మోహన్, సత్యనారాయణ, దొరబాబు, మహేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :