అభివృద్ధి విషయంలో రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ కు కూటమి నాయకులందరూ పూర్తి సహకారాన్ని అందించాలని మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజి వేమా కోరారు. మలికిపురం మండలం మలికిపురంలో నూతనంగా నిర్మించిన రహదారులు, డ్రైనేజీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వేమా గ్రామాలలో అభివృద్ధి పనుల నిర్వహణకు ఎమ్మెల్యే చూపుతున్న చొరవను కొనియాడారు.