సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుక్రవారం ఉత్తర ద్వారా దర్శనం ఏర్పాటు చేశారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఉత్తర ద్వారం వద్ద లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారి వేద ఆశీర్వచనం అందించారు. భారీ సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు.