రాజోలు నియోజకవర్గం శివారు ప్రాంతం కావడంతో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. అమలాపురంలో మంగళవారం జరిగిన ఎన్డీఏ సమావేశంలో ఆయన జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి నియోజకవర్గ సమస్యలను తీసుకువచ్చారు. నియోజకవర్గంలో ప్రజలు త్రాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఏటిగట్లు, ఇరిగేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ఆయన మంత్రికి వివరించారు.