రాష్ట్ర స్థాయి పోటీలలో పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ

57చూసినవారు
రాష్ట్ర స్థాయి పోటీలలో పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ
రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో రాజోలు గురుకుల కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపల్ లలిత కుమారి ఆదివారం తెలిపారు. సబ్ జూనియర్ కేటగిరీలో మంజుల ప్రథమ స్థానం సాధించి బంగారు పతకం గెలుపొందిందన్నారు. ఎన్. జెస్సికా ద్వితీయ స్థానంతో వెండి పధకం సాధించిందని తెలిపారు. ఈ పోటీల్లో మొత్తం ఆరుగురు విద్యార్థులు పాల్గొన్నారని పేర్కొన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్