తుని నియోజకవర్గానికి ఉపాధి పథకం ద్వారా రూ. 3. 25 కోట్ల నిధులు మంజూరైనట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. ఈ నిధులలో తుని మండలానికి రూ. 1. 10 కోట్లు, కోటనందూరు మండలానికి రూ. 80 లక్షలు, తొండంగి మండలానికి రూ. 1. 35 కోట్ల చొప్పున కేటాయించామన్నారు. రెండు నెలల కిందట ఉపాధి హమీ పథకం ద్వారా రూ. 14. 93 కోట్లు మంజూరు చేయగా ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి.