దేశభక్తిని పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా యోజన లక్ష్యమని కోటనందూరు మండల బీజేపీ అధ్యక్షులు దొగ్గా వెంకట శేషగిరి అన్నారు. మంగళవారం పాతకొట్టాంలోని జడ్పీ హైస్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.