కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఏడువారాల వెంకటేశ్వర స్వామి వారిగా విరజిల్లుతున్న తుని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తులు రద్దీతో కలకలాడుతూ కనిపిస్తుంది. కార్తీక మాసం శుద్ధ పాడ్యమి తొలి రోజు శివ కేశవులకు ఎంత ప్రీతికరమైన పర్వదినం కావడంతో విశేష భరితమైన అలంకరణలో ఇక్కడ కల్యాణ వెంకటేశ్వర స్వామి భక్తులకు శనివారం దర్శనం ఇచ్చారు.