ఘంటసాల మండలం శ్రీకాకుళం నుండి పులిగడ్డ వరకు కృష్ణానదిలో ఇసుక మాఫియా పెద్ద ఎత్తున త్రవ్వకాలు చేపట్టి బయటకు తరలించారు. కానీ అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తుంది. గురువారం రాత్రి భారీ టిప్పర్లలో ఇసుక బయటికి తరలి వెళ్ళివెళ్ళింది. కూటమి ప్రభుత్వంలో ఇసుక మాఫియా నిబంధనలకు వ్యతిరేకముగా యంత్రాల సహాయముతో అక్రమ త్రవ్వకాలు చేపట్టి పెద్ద ఎత్తున ఇసుకను బయటికి తరలిస్తున్నారు.