ఉపాధి నిధులు రూ. 18.40 కోట్లతో 391 సీసీ రోడ్ల నిర్మాణం

75చూసినవారు
ఉపాధి నిధులు రూ. 18.40 కోట్లతో 391 సీసీ రోడ్ల నిర్మాణం
అవనిగడ్డ నియోజకవర్గంలో ఉపాధి పథకం నిధులు రూ. 18. 40 కోట్లతో 391 సిసి రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం అవనిగడ్డ గ్రామ పంచాయతీలో మన పంచాయతీ మన సాధికారత గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థలకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్