ప్రధాన రహదారి సమస్యను పరిష్కరిస్తాం : ఏఈ

66చూసినవారు
ప్రధాన రహదారి సమస్యను పరిష్కరిస్తాం : ఏఈ
అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలులంక ప్రధాన రహదారి సమస్యను పరిష్కరిస్తామని పంచాయతీరాజ్ ఏఈ వాసుదేవరావు తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆదేశాలతో ఏఈ వాసుదేవరావు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు సమస్యను పరిశీలించారు. ఇటీవల కృష్ణా నదికి వచ్చిన వరదలకు ఈ రహదారి కొట్టుకుపోవడంతో రేపటికల్లా జిఎస్బి వేసి సమస్య పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు.

సంబంధిత పోస్ట్