యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ నెల 14 న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఈ మేరకు గురువారం గన్నవరంలో ఆయన మాట్లాడుతూ అరబిందో ఫార్మా, పేటిఎం, హెచ్సీ ఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, మెడ్ ప్లస్, విజేత సూపర్ మార్కెట్, హెచ్ డీఎఫ్సీ, కొటక్, ఇండిగో, వరుణ్, రిలయన్స్ క్యాపిటల్, ఎయిర్ టెల్, వంటి 50 కు పైగా ప్రముఖ సంస్థలు ఎంపికలు నిర్వహిస్తాయన్నారు.