పిల్లలు తమ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో దగ్గర ఉండి చూసుకున్నప్పుడే సమాజం అభివృద్ధి చెందినట్లని గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. పిల్లల కోసం డబ్బులు సంపాదించి వారిని అమెరికా పంపి వారు ఇక్కడ ఇబ్బందులు పడటం చూస్తుంటే భాదేస్తుందన్నారు. మండలంలోని చినఅవుటపల్లి పుణ్యాచారిటీస్ వృద్ధాశ్రమం, సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం మంగళవారం జరిగింది.