ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని కూటమి పార్టీల నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన గుడ్లవల్లేరు గ్రామంలో దీపం పథకాన్ని కూటమి పార్టీల నేతలతో కలిసి గుడివాడ జనసేన పార్టీ ఇన్చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టిడిపి నేత వెనిగండ్ల రామకృష్ణ(నాని) ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.