జగ్గయ్యపేట ఎస్టి గురుకుల పాఠశాలలో బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అడిషనల్ జూనియర్స్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎం శోభారాణి మాట్లాడుతూ విద్యార్థులు ఇప్పటినుండే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని విద్యలో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు.