లడ్డు తయారీలో కల్తీ ముడి సరుకు ఉన్నట్టు గుర్తించిన ఎమ్మెల్యే

73చూసినవారు
లడ్డు తయారీలో కల్తీ ముడి సరుకు ఉన్నట్టు గుర్తించిన ఎమ్మెల్యే
శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయంలో లడ్డు తయారీలో కల్తీ ముడి సరుకు ఉన్నట్టు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ గుర్తించారు. ఆదివారం శ్రీ తిరుపతమ్మ లడ్డు తయారీకి వినియోగించే పదార్థాలను పరిశీలించారు. నెయ్యి, జీడిపప్పు, శెనగపిండి నాసిరకం ఉన్నట్లు తెలపడంతో కలకలం రేపుతుంది,మిగిలిన సరుకులు నాణ్యత నిర్ధారణ చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుమల ఘటన బయటపడిన తర్వాత ఎమ్మెల్యే రాజగోపాల్ తనిఖీ చేపట్టారు.

సంబంధిత పోస్ట్