కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శనివారం రైల్వే అధికారులతో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోర్టు నిర్మాణం ద్వారా అభివృద్ధి చెందుతున్న మచిలీపట్నం రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధులు ప్రత్యేకంగా కేటాయిస్తామని తెలిపారు. ఎంపీ బాలశౌరి వినతి మేరకు మచిలీపట్నం నరసాపురం రైల్వే లైన్, రేపల్లె నూతన రైల్వే లైన్లను త్వరలో పనులు ప్రారంభించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.