మచిలీపట్నం: రేపు కలెక్టరేట్ లో మీకోసం కార్యక్రమం

79చూసినవారు
మచిలీపట్నం: రేపు కలెక్టరేట్ లో మీకోసం కార్యక్రమం
ఈ నెల 18వ తేదీ సోమవారం మచిలీపట్నంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10: 30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంతో పాటు ఆర్డీవో కార్యాలయాలు, మండల పరిషత్, తాసిల్దార్ కార్యాలయాల్లో కూడా అర్జీలు స్వీకరిస్తారని ఆయన తెలియజేశారు.

సంబంధిత పోస్ట్