గుడివాడ నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను మచిలీపట్నం సబ్ జైల్ లో మాజీమంత్రి పేర్ని నాని, మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ సోమవారం కలిసి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని చట్టబద్ధంగా ప్రతి సమస్యను ఎదుర్కొందామని కార్యకర్తలకు తెలిపినట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం కావాలనే కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు పాల్గొన్నారు.