మచిలీపట్నం: నిబంధనలకు విరుద్ధంగా షాపులు ఏర్పాటు

53చూసినవారు
దీపావళి సందర్భంగా మచిలీపట్నంలో బాణా సంచా విక్రయ దుకాణాల ఏర్పాటులో అధికారులు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చేశారు. అన్ని జాగ్రత్తలతో దుకాణాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాల్సిన అధికారులే నిబంధనలన్నీ పక్కన పెట్టి వారికి ఇష్టమొచ్చిన రీతిలో దుకాణాల ఏర్పాటుకు అవకాశం ఇచ్చారు. బుధవారం మొత్తం142 బాణా సంచా దుకాణాల ఏర్పాటుకు అధికారులు అనుమతులు ఇచ్చారు. జనావాసాల మధ్య షాపులు ఉండడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్