ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారిణి తాహెరా సుల్తానా అన్నారు. గురువారం మచిలీపట్నంలో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు పొందిన వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సుల్తానా మాట్లాడుతూ..రేపటి పౌరులను తీర్చిదిద్దగలిగిన సత్తా ఉపాధ్యాయులకే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంఈఓలు పాల్గొన్నారు.