మైలవరంలో దళిత జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బుర్రి ప్రతాప్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. దళితుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్లెక్సిని చించి అవమాన పరిచిన, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణపై, నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.