ఏపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా సమర్పించారు. నేడు ఆర్. కృష్ణయ్య తన పదవికి మంగళవారం రిజైన్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ఖాళీ అయిన రాజ్యసభ సీటును టీడీపీ సీనియర్ నేత, మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వర రావుకు కూటమి సర్కార్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ కేటాయించకపోవడంతో తాజాగా ఖాళీ అయిన స్థానాన్ని ఆయనకు ఇవ్వనుందని సమాచారం.