పామర్రు నియోజకవర్గ పరిధిలోని కృష్ణా కరకట్టపై గురువారం రాత్రి జరిగిన ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. తోట్లవల్లూరు మండల కేంద్రమైన తోట్లవల్లూరు రోడ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాములలంక గ్రామానికి చెందిన వ్యక్తి మరణించారు. ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే తోట్లవల్లూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.