మోటార్ సైకిల్ ని లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి పామర్రు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మొవ్వ మండలం కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని అయేంకి అడ్డరోడ్డు వద్ద మోటార్ సైకిల్ ని లారీ ఢీకొన్న ఘటనలో అయ్యంకి గ్రామానికి చెందిన పడమటి నాగేశ్వరరావు, పడమటి మునేశ్వరరావులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు.