సత్యాగ్రహమే ఆయుధంగా, అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛా, స్వతంత్రాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ అని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. గాంధీజీ జయంతి సందర్భముగా పెడనలో గాంధీజీ విగ్రహానికి పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ బుధవారం పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మహాకూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.