వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా 216 జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయవద్దని కృత్తివెన్ను ఎస్ఐ ఎ. పైడి బాబు సూచించారు. సోమవారం 216 జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేసి వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పైడి బాబు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అమూల్యమైన మీ జీవితం మీ చేతుల్లోనే ఉందన్నారు.