తుఫాను కారణంగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను, పొంగిపొర్లుతున్న కాలువలను మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి పరిశీలించారు. సోమవారం పెడన నియోజకవర్గ పరిధిలోని గూడూరు మండలంలో నీట మునిగిన పంట పొలాలను స్థానిక శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్, మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేద వ్యాస్ తదితరులతో కలిసి పరిశీలించారు.