పెడన నియోజకవర్గంలోని చినగొల్లపాలెం గ్రామం నందు రూ. 40 లక్షల వ్యయంతో నిర్మించే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యలు వల్లభనేని బాలశౌరి గురువారం శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రత్యేక నిధుల ద్వారా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు వివరించారు. గ్రామస్తులు పలు సమస్యలను ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.