బంటుమిల్లి: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం పెద్దతుమ్మడికి చెందిన గీత సంపూర్ణ (22) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంపూర్ణకు వివాహమై ఐదు సంవత్సరాలు కాగా, ఇద్దరు సంతానం. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో మనస్థాపానికి గురై ఆమె ఉరివేసుకొని శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బంటుమిల్లి పోలీసులు తెలిపారు.