పెడన నియోజకవర్గం సాతులూరు రహదారి అద్వాన్న స్థితికి చేరడంతో ప్రమాదాల బారిన పడుతున్నట్లు స్థానికులు వాపోయారు. ఆదివారం మధ్యాహ్నం శ్రీనివాసరావు అనే వ్యక్తి సాతులూరు రహదారిలో పడి గాయపడినట్లు వివరించారు. రహదారి మొత్తం అధ్వానంగా, గోతులమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారిని అభివృద్ధి పరచాలని ప్రజలు కోరుతున్నారు.