వర్షాలతో నీట మునిగిన కాలనీ రోడ్లను పంచాయితీ అధికారులు, గ్రామ సర్పంచ్ పట్టించుకోవడం లేదని పెడన మండలం లంకలకలవగుంట గ్రామం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీ వసూలు విద్యుత్ మోటార్లతో రోడ్లపై నిలిచిన నీటిని తోడారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ ఇబ్బందిని ఏ అధికారి, సర్పంచ్ కానీ పట్టించుకోలేదని తెలిపారు. దీంతో మోటార్ల సహాయంతో నీటిని బయటికి తోడినట్లు తెలిపారు.