పెనమలూరు మండలంలో సంభవించిన అధిక వర్షాలు, వరదలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం నుండి ప్రత్యేక బృందం రానున్నదని, అందుకు వారి పర్యటనకు తగిన ఏర్పాట్లు చేసినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. 11వ తేదీ బుధవారం పెనమలూరు మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు నిర్ణయించిన షెడ్యూల్ మేరకు కేంద్ర బృందం పర్యటిస్తుందని తెలిపారు.