ఎమ్మెల్సీ ఎన్నికల కోసం గ్రాడ్యుయేట్స్ అందరూ నవంబర్ 6లోపు కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి గురువారం పత్రికా ప్రకటన విడదల చేశారు. త్వరలో జరగనున్న కృష్ణా – గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో గ్రాడ్యుయేట్లు అందరూ ఓటు వేసేందుకు వచ్చే నెల నవంబర్ 6 వరకు ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారని తెలిపారు.