రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రాతినిథ్యం వహిస్తున్న నూజివీడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుందనే నిందారోపణలు చేయటం తగవని నూజివీడు నియోజకవర్గ టిడిపి నాయకులు హితవు పలికారు. సోమవారం తాడిగడపలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో టిడిపి నాయకులు విలేకరులతో మాట్లాడుతూ అక్రమ మైనింగ్ వ్యవహారంపై శాసనసభ్యులు యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.